రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ పదవికి నన్నపనేని రాజకుమారి రాజీనామా చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి రాజీనామా లేఖను అందించారు. ప్రభుత్వం మారటంతో నైతిక బాధ్యతగా పదవి నుంచి తప్పుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు 3 వార్షిక నివేదికలను గవర్నర్‌కు అందించారు. నివేదికను పరిశీలించిన గవర్నర్ తనను అభినందించారని నన్నపనేని వివరించారు. తన హయాంలో బాధిత మహిళలకు అన్ని రకాలుగా అండగా నిలిచానన్నారు. వసతి గృహల్లో భద్రత పెంచాల్సిన అవసరముందని వెల్లడించారు. రాష్ట్రంలో కుటుంబ వ్యవస్థను పటిష్టపరచాలని సూచించారు.
ఇది కూడా చదవండి.