సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమ, త్యాగాలకు ప్రతీకగా రంజాన్ నిలుస్తుందన్నారు. లాక్ డౌన్‌లోనూ మనో ధైర్యంతో ఉంటూ ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలు చేశారని కొనియాడారు.
వారి ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. అందరూ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలని కోరిన బాలకృష్ణ.. సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని ఆకాంక్షించారు.
ఇవీ చదవండి.. గుంటూరులో తల్లిదండ్రులతోపాటు కుమార్తె ఆత్మహత్య