ETV Bharat / state

భార్య పుట్టింటికి వెళ్లిందని.. భర్త - కృష్ణాజిల్లా నేర వార్తలు

భార్య పుట్టింటికి వెళ్లిందని మనస్తాపం చెంది భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా నందిగామ మండలంలో జరిగింది. బాధితున్ని నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

భార్య పుట్టింటికి వెళ్లిందని...భర్త ఆత్మహత్య యత్నం

author img

By

Published : Aug 24, 2021, 5:17 PM IST

కృష్ణాజిల్లా నందిగామ మండలం అంబారుపేట గ్రామానికి చెందిన నాగరాజు ఆత్మహత్యకు యత్నించాడు. భార్య గొడవపడి అలిగి పుట్టింటికి వెళ్లడంతో... మనస్తాపానికి గురైన అతను పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడని బంధువులు తెలిపారు. హుటాహుటిన నాగారాజును నందిగామ ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడ తరలించారు.

ఇదీ చదవండి: సీఎస్, డీజీపీతో జాతీయ ఎస్సీ కమిషన్ ఉపాధ్యక్షుడు భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.