కృష్ణాజిల్లా నందిగామ అదనపు ఎస్పీ మోకా సత్తిబాబు 112యాప్, పోలీస్ వాట్సాప్ నంబర్‌పై మహిళలకు అవగాహన కల్పించారు. ఆపదలో ఉన్నప్పుడు 112 యాప్‌లో పోలీస్ బటన్ నొక్కితే చాలు నిమిషాల్లో సంఘటన స్థలానికి చేరుకుంటామని తెలిపారు. జిల్లాలోని మహిళలు, విద్యార్థినిలు తమ చరవాణిలలో ఈ రెండు నంబర్లు సేవ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆడవారి ఆత్మరక్షణ కోసం తీసుకొచ్చిన ఈ రెండు నంబర్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు.
ఇదీ చూడండి
వైరల్: పార్లమెంటులో 'దిశ' చర్చ సందర్భంగా వైకాపా ఎంపీ కునికిపాట్లు