తెదేపా కార్యాలయంలో ముట్లూరు గ్రామ ప్రజలు, కార్యకర్తలు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను కలిశారు. కిందటి ఎన్నికల్లో పార్టీకి మద్దతుగా నిలిచినందుకు... ఎస్సీ వర్గానికి చెందిన 60 కుటుంబాలపై వైకాపా నాయకులు దాడులు చేశారంటూ... లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు. మహిళలను అసభ్య పదజాలంతో తిట్టడం, తెదేపా మద్దతుదారుల ఇళ్లపై రాళ్లు రువ్వడం, అక్రమ కేసులు బనాయిండటం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు.
తమను గ్రామాల నుంచి వెళ్లపోవాలంటూ ఒత్తిడి చేస్తున్నారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా లాభం లేదని వాపోయారు. త్వరలోనే గ్రామానికి పార్టీ తరపున కమిటీ పంపిస్తామని లోకేశ్ హామీఇచ్చారు. అక్రమ కేసులపై న్యాయ పోరాటానికి పార్టీ సిద్ధంగా ఉందని భరోసా ఇచ్చారు. అధికారులతో న్యాయం జరగకపోతే... తానే స్వయంగా వచ్చి సమస్యను పరిష్కరిస్తామని లోకేశ్ ధైర్యం చెప్పారు.
ఇదీ చదవండి :