భర్తపై భార్యే హత్యాయత్నం చేసిన ఘటన కృష్ణా జిల్లా ఇనగుదురుపేటలో చోటు చేసుకుంది. మచిలీపట్టణం మార్కెట్ యార్డు కమిటీ ఛైర్మన్, వైకాపా నేత అచ్చాబా కుమారుడు ఖాదర్ బాషాపై హత్యాహత్నం జరిగింది. భార్య నజియానే ఆ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. మరదలితో ఖాదర్‌బాషా సన్నిహితంగా ఉంటున్నాడంటూ..గతంలో గొడవలూ జరిగాయి. అదే కోపంతో ఈరోజు ఇంట్లో ఉన్న ఖాదర్‌పై నజియా పెట్రోల్ పోసి నిప్పంటించింది. తీవ్రగాయాలపాలైన ఖాదర్‌ను కుటుంబసభ్యులు విజయవాడ ఆసుపత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పెళ్లి వేడుకకు హాజరై.. పరలోకానికి చేరి..