విజయవాడ నగరశివారు సుందరయ్య నగర్లోని మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఓ భవనం మెట్లు ఒక్కసారిగా కూలిపోయాయి. ఈ ఘటనలో వాచ్మెన్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ సమయంలో పిల్లలు ఎవరూ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు, అధికారులు వెంటనే ప్రమాద స్థలాన్ని వచ్చి పరిశీలించారు. ఆ భవనం మెట్లు శిథిలావస్థలో ఉన్నందున దూరంగా విద్యార్థులకు క్లాసులు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: 'రాష్ట్రంలో అప్పులు పెరిగాయి కానీ.. అభివృద్ధి జరగలేదు'