ETV Bharat / state

విజయవాడలో ఊపందుకున్న పురప్రచారం - municipal elections

విజయవాడ నగరపాలక ఎన్నికల్లో విజయం కోసం తెదేపా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. కృష్ణలంకలోని డివిజన్లలో పాగావేయాలని లక్ష్యంగా నేతలు పురపోరుకు ప్రచారం చేపట్టారు. తాము వస్తే ప్రజలపై పన్నుల భారం పడకుండా చూస్తామని హామీ ఇచ్చారు.

tdp municipal election campaign at vijayawada
విజయవాడలో ఊపందుకున్న పురప్రచారం
author img

By

Published : Mar 2, 2021, 4:19 PM IST

విజయవాడలో నగరపాలక సంస్థ ఎన్నికలకు కేవలం తొమ్మిది రోజులే గడువు ఉండటంతో ప్రచారం ఊపందుకుంది. గత ఎన్నికల్లో కృష్ణలంకలోని ఎక్కువ డివిజన్లలో వైకాపా అభ్యర్థులు గెలుపొందడంతో.. ఈ సారి ఆ ప్రాంతంలో పట్టు సాధించేందుకు తెదేపా ప్రచారపోరుపై దృష్టి సారించింది. అక్కడి డివిజన్లలో ప్రచారానికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేశినేని నాని తెదేపా అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. కృష్ణలంక 22 వ డివిజన్ అభ్యర్థి చందన సురేష్ తరుపున ఎమ్మెల్యే గద్దె, ఎంపీ నానిలు పార్టీ శ్రేణులతో కలిసి ఉద్ధృతంగా ప్రచారం చేస్తుండగా.. మహిళలు హారతులతో వారికి స్వాగతం పలికారు.

నగరంలో తెదేపా అధికారంలోకి వస్తే.. ప్రజలపై పన్నుల భారం పడకుండా అభివృద్ధి చేస్తామని ఎంపీ హామీ ఇచ్చారు. వైకాపా అధికారంలోకి వస్తే.. ప్రజల నడ్డి విరిచే రీతిలో ఆస్తి విలువ ఆధారంగా పనుల భారం పడబోతోందని ఎమ్మెల్యే గద్దె రామమోహనరావు ఓటర్లను హెచ్చరించారు.

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతంలో మంజూరైన పనులు కూడా ఆగిపోయాయని, రోడ్డు గుంటలను కూడా పూడ్చలేని పరిస్థితిలో పాలన ఉందని తెదేపాలోకి వచ్చిన అభ్యర్థి సురేష్ అన్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా కరపత్రాలు పంచుతూ.. ప్రతి ఒక్కరినీ తెలుగుదేశం పార్టీకి, మిత్రపక్షం సీపీఐ పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపించాలని రెండు పార్టీల నేతలు కోరారు.

ఇదీ చదవండి: 'చంద్రబాబు సీఎం అవుతారన్న భయం జగన్‌లో మొదలైంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.