ETV Bharat / state

చిల్లర రాజకీయాలకు తెదేపా నేతలు స్వస్తి పలకాలి: ఎంపీ మోపిదేవి - mp mopidevii on tdp news

రాజకీయ మనుగడ కాపాడుకోవాలనే స్వార్థంతోనే తెదేపా నేతలు రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని.. ఎంపీ మోపిదేవి ధ్వజమెత్తారు. రాష్ట్రం అభివృద్ధికే వికేంద్రీకరణ బిల్లు అనీ.. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎంపీ అన్నారు.

mp mopidevi comments on tdp
ఎంపీ మోపిదేవి వెంకటరమణరావు
author img

By

Published : Aug 1, 2020, 3:52 PM IST

తెదేపా నేతలు చిల్లర రాజకీయాలకు స్వస్తి పలికి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని.. రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు హితవు పలికారు. తమ రాజకీయ మనుగడను కాపాడుకోవాలనే స్వార్థంతో రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు.. అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానులు ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఈ నిర్ణయాన్ని రాజకీయ మేధావులు సైతం స్వాగతించారని గుర్తు చేశారు.

అక్రమ సంపాదనను రాజధాని ముసుగులో పెట్టడం....రైతుల వద్ద నుంచి అవసరం లేకున్నా బలవంతంగా భూములు లాక్కుని తమ రియల్ ఎస్టేట్ వ్యాపార కేంద్రంగా తెదేపా నేతలు మార్చుకున్నారని ఆరోపించారు. అభివృద్ధిని అడ్డుకునేందుకే తెదేపా ఉద్యమాలు చేస్తుందని ధ్వజమెత్తారు. సీఎం జగన్ నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని ఎంపీ అన్నారు. ఏ ప్రాంతాల్లో ఎలాంటి నిర్మాణాలు చేపడితే అభివృద్ధిలో ముందుంటామనే అంశాలపై ముఖ్యమంత్రి ఆలోచిస్తున్నారన్నారు. అన్ని రంగాలతో పాటు రాష్ట్రంలో వైద్య సేవలను పెంచేందుకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి వైద్య కళాశాల, ప్రభుత్వ హాస్పిటల్​ ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా తెదేపా నాయకులు కళ్లు తెరచి...ఆరోపణలు ఆపి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని సూచించారు.

వైయస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి
వికేంద్రీకరణ బిల్లు రాష్ట్ర గవర్నర్ ఆమోదించటం...ఏపీ ప్రజల విజయమని మంత్రి శంకర్ నారాయణ అన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండలో.. వికేంద్రీకరణ బిల్లు ఆమోదంతో ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ.. వైయస్ రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

mp mopidevi comments on tdp
పాలాభిషేకం చేస్తున్న మంత్రి శంకర్ నారాయణ

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బిల్లు ఆమోదంపై ప్రజలు సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్​కి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. వికేంద్రీకరణతో యావత్తు రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించే.. సీఎం జగన్ వికేంద్రీకరణ బిల్లు తీసుకువచ్చినట్లు తెలిపారు. రాయలసీమ అభివృద్ధి ఏ మాత్రం ఇష్టంలేని చంద్రబాబు.. వికేంద్రీకరణకు అడ్డుపడ్డారనీ., రాయలసీమ ద్రోహి చంద్రబాబు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి: 'న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.