కృష్ణాజిల్లా మోపిదేవి శ్రీవల్లీ, దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి కళ్యాణ మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు షష్ఠి మహోత్సవాలు జరగనున్నాయి. ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్యాణం మహోత్సవం నిర్వహించనున్నారు. ఈరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెళ్లి కుమారుడిని చేశారు. రాత్రి 7 గంటలకు యాగశాల ప్రవేశం నిర్వహించనున్నారు.

తెలుగు రాష్ట్రాల నుంచి వేలసంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. కొవిడ్ నియంత్రణ ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా అవనిగడ్డ పోలీసులు పర్యవేక్షిస్తున్నారు.
ఇదీ చదవండి: మూడు రోజుల పాటు అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ