కృష్ణా – గుంటూరు ఉపాధ్యాయ నియోజకవర్గ శాసన మండలి ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్లన్నీ సక్రమంగా ఉన్నాయని, వాటిని ఆమోదించామని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. గుంటూరు కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకులు కె.వి.రమణ, అభ్యర్థుల సమక్షంలో పరిశీలన చేపట్టి అభ్యంతరాలను తెలుసుకున్నారు.
ఎన్నికలకు 20 మంది నామినేషన్లు దాఖలు చేశారని కలెక్టర్ వివేక్ యాదవ్ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసిన అభ్యర్థులు ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రవర్తనా నియమావళికి అతిక్రమించి ఎటువంటి కార్యక్రమాలు చేపట్టరాదని సూచించారు. నామినేషన్ల ఉప సంహరణకు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3 గంటల వరకు అవకాశం ఉందని.. అనంతరం పోటీలో ఉన్న వారి తుది జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిపై అవగాహనకు ఫిబ్రవరి 26 మధ్యాహ్నం 3.30 గంటలకు పోటీలో ఉన్న అభ్యర్థులు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్ల తెలిపారు.
ఇదీ చదవండి: