మహాశివరాత్రి వేడుకల్లో ఎమ్మెల్యే నృత్యం - MLA who danced during Mahashivaratri celebrations
కృష్ణా జిల్లా మైలవరం మండలం వెల్వడం గ్రామంలో శుక్రవారం రాత్రి అట్టహాసంగా మహా శివరాత్రి వేడుకలు జరిగాయి. శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నృత్యం చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రవాస భారతీయులు, గ్రామస్థులతో కలిసి ముందుగా లక్కిరెడ్డి బాల్ రెడ్డి ముఖద్వారాన్ని ప్రారంభించారు కృష్ణ ప్రసాద్. అనంతరం ప్రభ ఊరేగింపులో పాల్గొన్నారు. శ్రీ బాల కోటేశ్వర స్వామి అలయంలో పూజలు చేశారు.