విద్యుత్ బిల్లులపై తెదేపా అనవసర రాద్ధాంతం చేస్తోందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ మల్లాది విష్ణు అన్నారు. తెదేపాకు స్వప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం పట్టవన్నారు. విద్యుత్ బిల్లులు ఒకేసారి కట్టడంలో కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవమన్నారు. ప్రజల్లో అపోహలను పెద్దగా చూపించి.. ఏదో జరిగిపోతుందని ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నాయని ఎమ్మెల్యే మండిపడ్డారు. భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ బిల్లులతో లేవనెత్తిన అనుమానాలను, తెదేపానేత బొండా ఉమాకు బిల్లుపై ఉన్న అనుమానాలు అధికారులు నివృత్తి చేశారన్నారు. కేవలం 5 వందల యూనిట్లు దాటిన బిల్లులపై మాత్రమే ఛార్జీలు పెంచామన్నారు.
ఇదీ చదవండి: ఏ విపత్తుకైనా ప్రకృతిలోనే పరిష్కారాలు!