కృష్ణా జిల్లా గన్నవరం బాలుర పాఠశాల మైదానంలో జరిగిన ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీ.. వీఆర్వో రఖీబ్ అవినీతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 70మంది ఇళ్ల స్థలాల పట్టాలను దాచాడన్న బాధితుల ఫిర్యాదుతో వీఆర్వో రఖీబ్ వైఖరిపై మండి పడ్డారు. పట్టాలపై రెవెన్యూ సంతకాలు లేకపోవటంతో ఎమ్మార్వో నరసింహారావు సైతం ఆశ్యర్యానికి గురయ్యారు. తక్షణమే 70 పట్టాలపై తహసీల్దార్ నరసింహారావు సంతకాలు చేసి, బాధితులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా ఇళ్ల పట్టాలను అందజేశారు. సదరు వీఆర్వోను సస్పెండ్ చేయాలని గన్నవరం గ్రామస్థులు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :