కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో అభివృద్ధి పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు శుంఖుస్థాపన చేశారు. ఈ మేరకు గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం వైఎస్సార్ ఆసరా ద్వారా లబ్ధి పొందిన మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి చేసిన పాలాభిషేకం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల పార్టీ కన్వీనర్ వేమూరి గోవర్ధన, జడ్పీటీసీ అభ్యర్థి రాజులపాటి కల్యాణి, ఎంపీపీ అభ్యర్థి బంగారు బాబుతో పాటు మండల గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.
సచివాలయం, రైతు భరోసా కేంద్ర నిర్మాణానికి భూమి పూజ - అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు
కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం నడకుదురులో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణ పనులకు అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు భూమి పూజ చేశారు. వైకాపా ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసమే పని చేస్తుందని వెల్లడించారు.