ETV Bharat / state

మిర్చి రైతుల కన్నీరు!

author img

By

Published : Dec 13, 2020, 6:35 PM IST

మిర్చి రైతులకు వైరస్‌ మహమ్మారి కన్నీళ్లు తెప్పిస్తోంది. నాణ్యమైన విత్తుతో గంపెడాశ పెట్టుకుని.... అధిక దిగుబడులు సాధించాలని అనుకునే రైతులకు కడగండ్లు మిగులుస్తోంది. ఏ వెరైటీ రకం వేస్తే.... తెగుళ్ళ, తెల్ల దోమ, కొమ్మ విరుపు, పురుగుల బారి నుంచి తట్టుకుని... అధిక దిగుబడులు సాధించవచ్చో వాటిని ఎంపిక చేసుకుని మరీ పంట సాగు చేసినా ప్రయత్నాలు సఫలం కావడం లేదు. ఏ రకం విత్తనాన్ని ఎంపిక చేసుకున్నా- అది కచ్చితంగా పండుతుందో... లేక... పెట్టుబడి సైతం రాని పరిస్థితిలోకి నెడుతుందో తెలియని అయోమయంలో సాగుదారులు సతమతమవుతున్నారు. దీనికి తోడు వాతావరణంలో మార్పులు మిర్చి పైరుని దెబ్బతీస్తున్నాయి. ఇలాంటి పలు సమస్యలను మిర్చి రైతులు ఉద్యానశాఖ నిర్వహించిన తోటబడి కార్యక్రమంలో అధికారుల దృష్టికి తెచ్చారు.

మిర్చి రైతుల కన్నీరు!
మిర్చి రైతుల కన్నీరు!
మిర్చి రైతుల కన్నీరు!
మిర్చి రైతుల కన్నీరు!

కృష్ణా జిల్లాలో వాణిజ్య పంటగా రైతులు సాగు చేస్తున్న మిర్చిని వైరస్​ పట్టిపీడిస్తోంది. బొబ్బర తెగులు .... ఆకుముడత సోకడంతో పైరు కాపాడుకోవడానికి వారు అవసరానికి మించి అప్పులు చేస్తున్నారు. విత్తనంలో లోపమో, నర్సరీ పెంపకంలో లోపమో... లేక వాతావరణ ప్రతికూల ప్రభావమో... కానీ వీటికి వైరస్ తెగుళ్లు, తెల్ల దోమ సోకాయి. గతేడాది రైతులకు మంచి దిగుబడులు ఇచ్చిన మిర్చి రకాలు కూడా ఈ ఏడాది ఆదిలోనే హంసపాదు అన్నట్లు... వైరస్ సోకడంతో మిర్చి తోటలను దున్నేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులలో పశ్చిమ కృష్ణాలో వైరస్ తెగుళ్ళ రకాన్ని బట్టి 15 శాతం నుంచి 25 శాతం వరకు ఉన్నట్లు తమ పరిశీలనలో గమనించినట్లు ఉద్యాన అధికారులు తెలిపారు.

అధిక వర్షాలతో మిర్చి పంట బాగా దెబ్బతింది. ఎకరానికి లక్షన్నర రూపాయలు పెట్టుబడి పెట్టాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. పంట తీరు చూస్తే 10 క్వింటాలు దిగుబడులు రావడం కూడా ప్రశ్నార్థకమేనని రైతులు అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో మిర్చి రైతులు ఏదో ఒక్క రకాన్ని మాత్రమే కాకుండా.... వివిధ రకాల మిర్చి వెరైటీ లు పండిచటం వల్ల.. ఇలాంటి పరిస్థితులను అధిగమించవచ్చంటున్నారు అధికారులు.

బయో మందులు వాడకంతో తెల్ల దోమ ప్రభావం ఎక్కువగా ఉంటుందని... తోట బడిలో ఉద్యాన వన శాఖ అధికారులు చెప్పారు. మరికొంత మంది రైతులు సేంద్రియ పద్ధతుల్లో పెట్టుబడులు తగ్గించుకుని, తమ ఉత్పత్తులను అధికధరకు అమ్ము కుంటున్నామని... పెను గంచిప్రోలులో అధికారుల దృష్టికి తెచ్చారు. ప్రస్తుత పరిస్థితులలో రైతులు విభిన్న పద్ధతులలో ఉత్తమ ఫలితాలు పొందే రైతుల అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటే మిర్చి రైతులు మంచి దిగుబడులు సాధించవచ్చని తెలిపారు.

ఇవీ చదవండి

వృద్ధురాలిపై హత్యాయత్నం.. నిందితుడు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.