మత విద్వేషాలు రెచ్చగొట్టేవారిని కఠినంగా శిక్షిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. ఆలయాల మీద దాడులు చేసి లబ్ధిపొందే అవసరం వైకాపాకు లేదన్నారు. సీఐడీ విచారణలో ఇప్పటికే వీడియో ఫుటేజ్ బయటకు వచ్చిందని.. మరింత లోతుగా విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. విజయవాడ 42వ డివిజన్‌లో అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి వెల్లంపల్లి పరిశీలించారు.
సీఎం జగన్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారని వెల్లంపల్లి అన్నారు. సంక్షేమ పథకాలపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
ఇదీ చదవండి: తెదేపా నేత పట్టాభిపై దాడి.. మోకాలు, చేతులకు గాయాలు.. కారు ధ్వంసం