ETV Bharat / state

వినాయకుని వద్ద ప్రమాణం చేసేందుకు సిద్ధం: వెల్లంపల్లి

author img

By

Published : Sep 16, 2020, 10:01 PM IST

దుర్గ గుడి రథంలో వెండి సింహాలు అదృశ్యంపై విచారణ జరుపుతున్నామని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తెలిపారు. కుట్రలన్నింటినీ త్వరలోనే తేల్చుతామని అన్నారు. తాను అడిగే 5 అంశాలపై ప్రతిపక్షనేత చంద్రబాబు ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.

vellampalli
vellampalli

దేవాలయాలపై కక్షపూరితంగా.. ఉద్దేశ పూర్వకంగా ప్రభుత్వం ఏదీ చేయలేదని దేవదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. దీనిపై కాణిపాకం వినాయకుని వద్ద తాను ప్రమాణం చేసేందుకు సిద్దమని తెలిపారు. ఇదే సమయంలో తాను అడిగే 5 అంశాలపై ప్రతిపక్షనేత చంద్రబాబు కూడా ప్రమాణం చేసేందుకు ముందుకు రావాలని సవాల్ విసిరారు.

సీఎంగా ఉన్నప్పుడు ఏ ఆలయం కూల్చలేదని, ధ్వంసం చేయలేదని, ఏ గోకులాలను కూల్చలేదని, దేవాలయ భూములను బినామీలు, పార్టీ నేతలకు దోచి పెట్టలేదని, బూట్లతో పూజలు చేయలేదని చంద్రబాబు ప్రమాణం చేయగలుగుతారా అని మంత్రి ప్రశ్నించారు. ప్రమాణం చేయలేకపోతే చంద్రబాబు హిందువుల ద్రోహి అన్నట్లేనన్నారు. విజయవాడ దుర్గగుడి ఆలయం భద్రతా లోపం ఉందని... దీనిపై తమకూ అనుమానాలున్నాయన్నారు.

దుర్గ గుడి రథంలో వెండి సింహాలు అదృశ్యంపై విచారణ జరుపుతున్నామన్నారు. కుట్రలన్నీ తేల్చుతామని... బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అవసరమైతే క్రిమినల్ కేసులు పెడతామన్నారు. తనను బర్తరఫ్ చేయాలని, రాజీనామా చేయాలని డిమాండ్ చేసే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని విమర్శించారు. ఇదంతా అమరావతి భూముల విచారణ నుంచి దారి మళ్లించేందుకు హిందూ దేవాలయాలపై చంద్రబాబు చేస్తోన్న కుట్రగా భావిస్తున్నామన్నారు.

ఇదీ చదవండి

దుర్గమ్మ వెండి రథంలోని మూడు సింహాలు ఎవరు తీసుకెళ్లినట్టు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.