ETV Bharat / state

'పవనిజమంటే.. ప్యాకేజీకి మొగ్గు చూపడమే' - YCP leaders serious on pawan kalyan news

పవనిజం అంటే ప్యాకేజీకి మెుగ్గు చూపడమని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నీటి ప్రవాహాలతో నదులన్నీ నిండి ఉంటే.. ఇసుక పేరిట జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ రాజకీయాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.

minister vellampalli serious on pawan kalyan over long march programm at vishaka
author img

By

Published : Nov 4, 2019, 12:32 PM IST

జనసేన అధినేత పవన్​ కల్యాణ్​పై మంత్రి వెల్లంపల్లి తీవ్ర విమర్శలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్​పై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తీవ్ర విమర్శలు చేశారు. పవనిజం అంటే ప్యాకేజీకి మొగ్గు చూపడమేనని మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహాన్ని మంత్రి వైకాపా ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి పరిశీలించారు. జనసేన బ్యానర్​లో చంద్రబాబు ఇచ్చిన ప్యాకేజీ మేరకు జనసేనాని.. విశాఖలో నటిస్తున్నారని ఆరోపించారు. ఒక పక్క నదులన్నీ నీళ్లతో నిండి ఉంటే.. ఇసుక పేరిట రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వేలెత్తి చూపటమే పవన్ పనిగా పెట్టుకున్నారని వెల్లంపల్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో వారం రోజుల్లో నదుల్లో నీటి ప్రవాహం తగ్గే అవకాశం ఉన్నందున రాష్ట్రంలో ఇసుక కొరత తీరబోతోందన్నారు. ఇప్పటికైనా చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలిసి ప్రజల్ని తప్పుదోవ పట్టించే కార్యక్రమాలు మానుకోవాలని వైకాపా నేతలు హెచ్చరించారు.

ఇదీ చదవండి:

'రెండు వారాలే గడువు... స్పందించకపోతే అమరావతిలో నడుస్తా'

sample description
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.