ETV Bharat / state

ఆలయాలు తెరిచేందుకు సన్నద్ధంకండి: వెల్లంపల్లి

author img

By

Published : Jun 3, 2020, 5:27 PM IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్రంలో అన్ని దేవాలయాలను తెరిచేందుకు ఆలయ సిబ్బంది సిద్ధంగా ఉండాలని మంత్రి వెల్లంపల్లి ఆదేశించారు. కరోనా వ్యాప్తి చెందకుండా.. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని చెప్పారు.

minister vellampalli
minister vellampalli

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రంలో అన్ని దేవాలయాలను త్వరలో తెరిచేందుకు యంత్రాంగం సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర దేవదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ కోరారు. విజయవాడలోని దేవదాయశాఖ కమిషనర్‌ కార్యాలయం నుంచి అసిస్టెంట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్, ఆర్​జేసీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. సీఎం ఆదేశాల అనంతరం దేవాలయాలు తెరిచేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా అన్ని భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.

దేవాలయానికి వచ్చిన ప్రతి భక్తులు సంతృప్తికరంగా బయటకెళ్లేలా తగిన సేవలు, దర్శనం అందేలా చూడాలని మంత్రి వెల్లంపల్లి సూచించారు. ఆలయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. ఇప్పటికే ఈ విషయంలో ముఖ్యమంత్రి పలు సూచనలు ఇచ్చారని చెప్పారు. దేవాలయ భూములు కాపాడుకునే విషయంలో న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకునేందుకు కమిషన్ కార్యాలయం నుంచి వచ్చే సూచనలు తప్పకుండా పాటించాలని స్పష్టం చేశారు.

ప్రతి దేవాలయం విధిగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని... వృధా ఖర్చులు తగ్గించుకునేందుకు అధికారులు శ్రద్ధ చూపించాలని మంత్రి కోరారు. ఇప్పటికే ప్రతి దేవాలయంలో పరోక్ష సేవలను ప్రోత్సహిస్తూ సూచనలు ఇచ్చామన్న మంత్రి... గతంలో ఇచ్చిన సూచనల ప్రకారం ఆన్‌లైన్‌ సేవలు, డిజిటల్ లావాదేవీలపై శ్రద్ధ చూపించాలని కోరారు. ఆలయానికి వచ్చే చిన్నారులు, వృద్ధుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు.

ఇదీ చదవండి: 11న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.