పంచాయతీ ఎన్నికల్లో 80.37 శాతం వైకాపా బలపర్చిన అభ్యర్థులే గెలుపొందారని.. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ప్రభుత్వం పనితీరుకు ఈ ఫలితాలు నిదర్శనమన్న ఆయన జగన్ పాలనకు ఈ ఫలితాలు ప్రజలు కట్టిన పట్టమన్నారు. ఇదే స్ఫూర్తితో మున్సిపల్ ఎన్నికల్లోనూ ఘనవిజయం సాధిస్తామని పేర్కొన్నారు. విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
ఇవీ చూడండి... 'కొందరు అధికారులు వైకాపాకు కొమ్ముకాస్తున్నారు'