ఉదయం సమయంలో ప్రజలంతా గుంపులు గుంపులుగా బయటికి రావొద్దని మంత్రి కొడాలి నాని పిలుపునిచ్చారు. కృష్ణా జిల్లా గుడివాడ ఆర్డీవో కార్యాలయంలో పోలీస్, మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహిచారు. కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై చర్చించారు. అనంతరం సిబ్బందికి శానిటైజర్స్, మాస్కులు పంపిణీ చేశారు. గ్రామాల్లో ఇబ్బందిపడుతున్న ప్రజలకు... వైకాపా కార్యకర్తలు తమ వంతు సాయం అందించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి: