కృష్ణా జిల్లా గుడివాడలో అమృత్ పథకం నిధులతో నూతనంగా నిర్మించే రక్షిత మంచినీటి పథకానికి మంత్రి కొడాలి నాని శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం నియోజకవర్గంలో రూ.70 కోట్ల వరకు నిధులతో అభివృద్ధి పనులు జరుగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని ఆరోపించారు. గుడివాడ మండలం రామనపూడి గ్రామం నుంచి చిరిచింతల గ్రామం వరకు నాలుగు కోట్ల 35 లక్షల ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పథకం నిధులతో చేపట్టనున్న రహదారి నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు.
ఇదీ చదవండి: ఏలూరు ఘటనకు కచ్చితమైన కారణాలు కనుక్కోవాలి: సీఎం