ఎప్పుడూ లేనివిధంగా జూన్ నెలలోనే రైతులకు సాగునీరు అందించిన ఘనత వైకాపా ప్రభుత్వానిదేనని మంత్రి కొడాలి నాని అన్నారు. కృష్ణా జిల్లా పామర్రు మార్కెట్ యార్డు నూతన కమిటీ ప్రమాణోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
మార్కెట్ కమిటీ సభ్యులు ఎల్లప్పుడూ రైతులకు అందుబాటులో ఉండాలని మంత్రి సూచించారు. ప్రభుత్వానికీ, అన్నదాతలకూ మధ్య వారధిగా ఉంటూ పథకాలను వారికి వివరించాలన్నారు. పంట అమ్ముకునే సమయంలో తగు సూచనలు, సలహాలు ఇస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ ఉండేలా సీఎం జగన్ నిర్ణయించారని తెలిపారు.
ఇవీ చదవండి..