కృష్ణా డెల్టాలో ఈ ఏడాది మూడు పంటలు పండించేకునేందుకు అనువుగా జూన్ 10 నాటికి సాగునీరు విడుదల చేయనున్నట్లు గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్ స్పష్టం చేశారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా సాగునీటి పారుదల సలహా మండలి, వ్యవసాయ సలహా మండలి సమావేశాలకు ఆయన అధ్యక్షత వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విత్తనాలు నుంచి ధాన్యం విక్రయాల వరకు వ్యవసాయ శాఖ సిబ్బంది అన్నదాతకు సహకారం అందించాలన్నారు.
రూ. 45 కోట్ల ఓఎన్ఎంలతో కాల్వలకు అవసరమైన మరమ్మత్తులు చేపట్టడంతో పాటు తాగునీరు దుర్వినియోగం కాకుండా చూడాలని ఇరిగేషన్‌ను అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ క్రాప్ నమోదు, ధాన్యం విక్రయాలు వంటి అంశాల్లో గతంలో జరిగిన పొరపాట్లు తిరిగి పునరావృతం కాకుండా చూడాలన్నారు. సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్నినాని, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి :