కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం తక్కెళ్లపాడు గ్రామంలో ఈనెల 21న సీఎం జగన్ పర్యటించనున్నారు. "వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు- భూ రక్ష" పథకం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఏర్పాట్లు పరిశీలించారు. భూవివాదాలు తొలగిపోవాలనే ఆశయంతో సీఎం జగన్ భూ సర్వే కార్యక్రమాన్ని చేపడుతున్నారని మంత్రి అన్నారు. సర్వే సమయంలో ప్రజలు.. అధికారులకు సహకరించాలని ధర్మాన కోరారు. ఈ సర్వేల ద్వారా భూ సమస్యలు తొలగి గ్రామాలు ప్రశాంతంగా ఉంటాయని మంత్రి ఆకాంక్షించారు.
జగ్గయ్యపేట పట్టణంలోని శ్రీమతి గెంటేల శకుంతలమ్మ కళాశాల ఆవరణలో భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సభ ఏర్పాట్లను మంత్రి ధర్మాన కృష్ణదాస్, చీఫ్ కమిషనర్ ఆఫ్ లాండ్ అడ్మినిస్ట్రేషన్ నీరబ్ కుమార్ ప్రసాద్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను, కృష్ణాజిల్లా కలెక్టర్ ఇంతియాజ్, రెవిన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిద్దార్ధ జైన్ పరిశీలించారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్యేలు గ్రామాలకు వెళ్లాలి: సీఎం జగన్