ETV Bharat / state

'ఆరోపణలు నిరూపిస్తే.... మంత్రి పదవికి రాజీనామా చేస్తా' - భాజపా నేత కన్నా లక్ష్మీనారాయణ వార్తలు

కరోనా పరీక్షల కిట్ల విషయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణలను ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ఖండించారు. తనకు కంపెనీ ఉన్నట్లు రుజువు చేస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.... లేకుంటే కన్నా తన పదవికి రాజీనామా చేయాలని సవాల్‌ విసిరారు.

kanna vs buggana
kanna vs buggana
author img

By

Published : May 1, 2020, 2:41 PM IST

కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి బుగ్గన విమర్శలు

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కరోనా పరీక్షల కిట్ల విషయంలో కన్నా లక్ష్మీనారాయణ ఆరోపణల్లో నిజం లేదని స్పష్టం చేశారు. తనకు కంపెనీ ఉందని నిరూపిస్తే రేపు ఉదయం 9 గంటలకు మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. లేకుంటే కన్నా తన పదవికి రాజీనామా చేయాలన్నారు. 'మీ వయసుకు, బాధ్యతకు ఈ మాటలు తగినవేనా' అని కన్నాను విమర్శించారు. మరోవైపు ఎక్కువ కరోనా పరీక్షలు చేస్తున్నందువల్లే రాష్ట్రంలో కేసులు అధికంగా నమోదవుతున్నాయని బుగ్గన అన్నారు. అధిక పరీక్షల ద్వారా ఎక్కువ మందిని గుర్తించి... కరోనా వ్యాప్తిని అరికడతామని స్పష్టం చేశారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.