కరోనా విపత్కర పరిస్థితుల్లో తెదేపా నేతలు రాజకీయాలు చేయటం సరికాదని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. ప్రధానితో చంద్రబాబు మాట్లాడటం వల్ల తమ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు వారి కుటుంబాలు, గ్రామాలు, సమాజం గురించి ఆలోచిస్తుంటే... యనమల లాంటి వ్యక్తులు రాజకీయాలు మాత్రమే ఆలోచిస్తున్నారని ఆరోపించారు. కేసులను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపుతున్నామంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు అర్ధరహితమన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.1000 ఆర్థిక సాయం అందని వారికి ఈ దఫా అందిస్తామని మంత్రి బొత్స స్పష్టం చేశారు. ఆర్ధిక సాయం అందని వారు వాలంటీర్లను సంప్రదించాలని సూచించారు.
ఇదీ చదవండి: నిధులు ఇవ్వొద్దని ట్రెజరీలపై ఆంక్షలు సరికాదు: యనమల