రాష్ట్రంలో 7 లక్షల పింఛన్లు తొలగించామనే ఆరోపణలు సరికాదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. కొత్తగా 6 లక్షల మందికి పింఛన్లు మంజూరు చేశామని మంత్రి తెలిపారు. 300 యూనిట్లకు కరెంట్లు బిల్లు వచ్చిన వ్యక్తులు పింఛన్‌కు అనర్హులని మంత్రి పునరుద్ఘాటింటారు. గతంలో ఉన్న పింఛన్లలో 4 లక్షల 27 వేల మంది అనర్హులను గుర్తించి వారిని తొలగించినట్లు తెలిపారు. పింఛన్ల కోసం రూ.13.94 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు మంత్రి వెల్లడించారు.
ఇదీ చూడండి: