ఏపీ ప్రభుత్వం టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకుల్ని అవమానిస్తున్నారంటూ సినీ హీరో నాని చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ప్రభుత్వం సినిమా టికెట్ ధరలు తగ్గించడాన్ని ప్రజలు హర్షిస్తుంటే సినిమా హీరోలకు కడుపు మంట ఎందుకని అన్నారు. సినిమా హీరోలు రెమ్యునరేషన్ తగ్గించుకుని ఆ ప్రయోజనాల్ని ప్రేక్షకులకు బదిలీ చేయాలని ఆయన పేర్కొన్నారు. తమకు ఏ నానీలూ తెలీదని తెలిసిందల్లా కొడాలి నానీ మాత్రమేనని అన్నారు.
సినిమా పరిశ్రమలో జరిగే దోపిడీని అరికట్టేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. సినిమా ప్రొడక్షన్ ఖర్చు 30 శాతమైతే... సినిమా హీరోల రెమ్యూనరేషన్ 70 శాతం ఉంటోందని ఆయన అన్నారు. గతంలో సినీ ఫ్యాన్స్‌గా కటౌట్లు కట్టి తానూ నష్టపోయానని ఇప్పుడు అసలు వాస్తవం తెలిసివస్తోందని వ్యాఖ్యానించారు.
ఇదీ చూడండి:
థియేటర్లలో సౌకర్యాలపై తనిఖీలు.. బొమ్మరిల్లు మినీ థియేటర్ సీజ్!