ETV Bharat / state

విమానాశ్రయం సమీపంలో.. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి - గన్నవరం ఎయిర్ నేర వార్తలు

గన్నవరం విమానాశ్రయ సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. హత్యా, ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు గన్నవరం సీఐ శివాజీ తెలిపారు.

suicide
అనుమానస్పదస్థితిలో వ్యక్తి మృతి
author img

By

Published : Feb 11, 2021, 9:56 PM IST

కృష్ణా జిల్లా గన్నవరం విమానాశ్రయ ఆవరణలో ఓ వ్యక్తి అనుమానాస్పద రీతిలో చెట్టుకు ఉరి వేసుకుని మృతి చెందాడు. మృతుడు నిడమనూరు మోడల్ డైరీలో ఉద్యోగం చేస్తున్న కనకమేడల చైతన్యగా పోలీసులు గుర్తించారు. గత రాత్రి ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన వ్యక్తి తెల్లవారేసరికి మృతి చెందడంపై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

'నా చావుకి ఎవరూ కారణం కాదు' అని రాసి ఉన్న సూసైడ్ నోట్ మృతుడి జేబులో లభించిందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చైతన్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతికి గల కారణాలను దర్యాప్తు చేస్తున్నామని గన్నవరం సీఐ శివాజీ చెప్పారు.

ఇదీ చదవండి:

తెదేపా కార్యాలయంపై దాడి.. సామగ్రితో పాటు వాహనాలు ధ్వంసం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.