కొవిడ్ - 19 నిబంధనల్లో భాగంగా అసెంబ్లీ ప్రాంగణంలో నియంత్రణ చర్యలు తీసుకుంటున్నామని అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలిపారు. శాసనసభ, మండలి సభ్యులు తమ వెంట వ్యక్తిగత సహాయకులు, వ్యక్తిగత కార్యదర్శులను తీసుకురావొద్దని సూచించారు. మంత్రులు ప్రాంగణంలోకి వాహనంలో ప్రవేశించే సమయంలో అందులో ఇతరులను అనుమతించబోరని.. సందర్శకులను సైతం తమ వెంట తీసుకురావొద్దని పేర్కొన్నారు.
ఈ మేరకు ఆయన బులెటిన్ విడుదల చేశారు. అసెంబ్లీలో నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సమావేశాలు నిషేదమని వివరించారు. బ్యానర్లు, ఫ్లకార్డులు, కరపత్రాలు, స్ప్రేలు వంటివి అనుమతించబోమని అన్నారు.
ఇదీ చూడండి..
వారధి పాఠ్య పుస్తకాలపై సీఎం ఫోటో ఎలా ముద్రిస్తారు..?: దేవినేని