ETV Bharat / state

GAS LEAKAGE: నూజివీడులో మెగా గ్యాస్ పైప్​లైన్ లీక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు - నూజివీడులో పైప్ లీక్

నూజివీడులో మెగా గ్యాస్ పైప్ లైన్ లీకేజ్‌

author img

By

Published : Oct 21, 2021, 5:01 PM IST

Updated : Oct 21, 2021, 5:33 PM IST

16:58 October 21

VJA_Gas pipeline leak_Breaking

నూజివీడులో మెగా గ్యాస్ పైప్​లైన్ లీక్

కృష్ణా జిల్లా నూజివీడులో మెగా గ్యాస్ పైప్​లైన్ లీకై మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. హనుమాన్ జంక్షన్ రోడ్డులోని సూపర్ మార్కెట్ వద్ద ఉన్న చెత్తకు.. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు.

దీంతో ఒక్కసారిగా పైప్​లైన్ లీకై తీవ్రస్థాయిలో మంటలు ఎగసిపడ్డాయి. భారీగా ఎగసిపడ్డ మంటలతో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

మెగాగ్యాస్ పైప్​లైన్ వారికి సమాచారం అందించడంతో.. గ్యాస్ సరఫరా నిలిపేశారు. అయినప్పటికీ.. మంటలు అదుపులోకి రాలేదు. ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు.

ఇదీ చదవండి:

MURDERS: కడపలో ఘోరం.. తల్లీకూతుళ్లను బలిగొన్న క్షణికావేశం!

Last Updated : Oct 21, 2021, 5:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.