కృష్ణా జిల్లాలో కార్మిక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కరోనా దృష్ట్యా భౌతిక దూరాన్ని పాటిస్తూ వేడుకలను జరుపుకున్నారు. కంచికర్ల మండలంలో రిక్షా వర్కర్స్ యూనియన్.. సీఐటీయూ ఆధ్వర్యంలో జెండాను ఎగురవేశారు. లాక్‌డౌన్ దృష్ట్యా కార్మికులకు 10వేల రూపాయలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: రేషన్ ఇప్పించలేదని మహిళా వాలంటీర్‌పై దాడి