ETV Bharat / state

'మండలి ఛైర్మన్ షరీఫ్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది' - మండలి చైర్మన్ చిత్రపటానికి జిల్లాల్లో పాలాభిషేకం..

అమరావతి రాజధాని ఆశలను సజీవంగా నిలిపి... అధికారపక్ష ఒత్తిడులకు తలొగ్గకుండా నిజాయతీగా వ్యవహరించి శాసనమండలి గౌరవాన్ని పెంచిన ఛైర్మన్ షరీఫ్, అంబేడ్కర్ చిత్రపటాలకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు, ప్రజాసంఘాలు, వివిధ పార్టీ నేతలు పాలాభిషేకం చేశారు.

mandali chairman
మండలి చైర్మన్ చిత్రపటానికి జిల్లాల్లో పాలాభిషేకం..
author img

By

Published : Jan 23, 2020, 11:42 PM IST

Updated : Jan 24, 2020, 8:04 AM IST

'మండలి ఛైర్మన్ షరిఫ్ నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుంది'

కృష్ణా జిల్లాలో...
మండలి ఛైర్మన్ షరిఫ్, అంబేడ్కర్ చిత్రపటాలకు నందిగామ నియోజకవర్గంలో రైతులు, పలు పార్టీల నేతలు పాలాభిషేకం చేశారు. అనతరం నిర్వహించిన ర్యాలీలో మాజీమంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు పాల్గొన్నారు. మండలి ఛైర్మన్ షరిఫ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ... కృష్ణా జిల్లా చందర్లపాడులో ముస్లింలు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు.

అనంతపురం జిల్లాలో...
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నివాసం వద్ద చంద్రబాబు, మండలి ఛైర్మన్ షరిఫ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. కదిరిలోని అంబేడ్కర్ కూడలిలో తెదేపా నాయకులు, కార్యకర్తలు శాసనమండలి ఛైర్మన్ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రభుత్వ నిర్ణయానికి రాజ్యాంగబద్ధంగా బ్రేకులు వేశారని హర్షం వ్యక్తం చేశారు.
కళ్యాణదుర్గం పట్టణంలో షరిఫ్​కు మద్దతు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీ-కూడలిలో మండలి ఛైర్మన్ షరిఫ్, అంబేడ్కర్, చంద్రబాబు, లోకేశ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఉరవకొండ పట్టణంలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. శాసనమండలి ఛైర్మన్ షరిఫ్ తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోతుందని పేర్కొన్నారు. మండలి ఛైర్మన్ షరిఫ్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

బుక్కరాయసముద్రం మండల కేంద్రంలో మండలిలో ఛైర్మన్ షరిఫ్, అంబేడ్కర్ విగ్రహానికి రైతులు పాలభిషేకం చేశారు. మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపినందుకు రాజధాని ఐకాస నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ... మడకశిర పట్టణంలో షరిఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో..
రాజధాని వికేంద్రీకరణ బిల్లును ఎంపిక సంఘానికి పంపిన శాసనమండలి ఛైర్మన్ షరిఫ్ చిత్రపటానికి... కాకినాడలో తెదేపా కార్యకర్తల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. రాజమహేంద్రవరంలోని గోకవరం బస్టాండ్ వద్ద తెలుగు యువత ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు.

చిత్తూరు జిల్లాలో..
అమరావతి పరిరక్షణ సమితి ఐకాస ఆధ్వర్యంలో తిరుపతి, కలికిరిలో అంబేడ్కర్‌ విగ్రహం, శాసనసమండలి ఛైర్మన్‌ షరిప్‌ చిత్రపటానికి తెదేపా నేతలు క్షీరాభిషేకం చేశారు.

ప్రకాశం జిల్లాలో ..
ప్రకాశం జిల్లా చీరాలలోని గడియార స్తంభం కూడలిలో... మాజీమంత్రి పాలేటి రామారావు ఆధ్వర్యంలో షరిఫ్​ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

గుంటూరు జిల్లాలో...
మండలి ఛైర్మన్ షరిఫ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ... తెనాలి అఖిలపక్ష జేఏసీ ఆధ్వర్యంలో మార్కెట్ సెంటర్లో షరిఫ్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు. గుంటూరు లాడ్జ్ సెంటర్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులర్పించారు. హిమని సెంటర్ గాంధీజీ విగ్రహం వద్ద తెదేపా శ్రేణులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మొదట గాంధీజీ విగ్రహానికి, అనంతరం కౌన్సిల్ ఛైర్మన్ షరిఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లాలో..
పశ్చిమగోదావరి జిల్లాలో తెదేపా శ్రేణులు, ప్రజాసంఘాల నేతలు మండలి ఛైర్మన్ షరిఫ్​కు కృతజ్ఞతలు తెలిపారు. షరిఫ్ చిత్రపటానికి పాలభిషేకం నిర్వహించారు.

నెల్లూరు జిల్లాలో...
నెల్లూరు జిల్లా సంగం బస్టాండ్ సెంటర్​లో తెలుగు యువత మండల అధ్యక్షుడు కాకు మధుసూదన్ ఆధ్వర్యంలో మండలి ఛైర్మన్ షరిఫ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. షరిఫ్ తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమని తెలుగుదేశం పార్టీ హర్షం వ్యక్తం చేసింది. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్షకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు.

ఇదీ చూడండి:తెలంగాణలో దారుణం.. బాలికపై 63 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం

sample description
Last Updated : Jan 24, 2020, 8:04 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.