కృష్ణాజిల్లా అడ్మిన్ అడిషనల్ ఎస్పీగా మలిక గర్గ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబును ఆమె మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. పోలీస్ సంక్షేమం, సమర్థవంతమైన పోలీసు సేవలను ప్రజలకు అందజేయడంలో తమ వంతు సహకారం అందిస్తానని అన్నారు. మహిళల భద్రతకై ప్రత్యేక దృష్టిసారిస్తానని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందని, ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేలా కృషి చేస్తానన్నారు.
ఇవీ చదవండి