కృష్ణా జిల్లా మోపిదేవి మండల కేంద్రంలో పురాతన వంతెనపై నిర్మించిన 216వ జాతీయ రహదారి.. కొంత భాగం కూలి పోయింది. వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రమాదమని తెలిసినా కొందరు వంతెనపై నుంచి ప్రయాణం సాగిస్తున్నారు. భారీ వాహనాలను మోపిదేవి, రావివారిపాలెం, వెంకటాపురం, శివరామపురం మీదుగా చల్లపల్లిలో ఉన్న జాతీయ రహదారికి కలిసేలా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
వంతెన కూలినట్టు అధికారులు కనీసం ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయలేదని గ్రామస్థులు, వాహనదారులు మండిపడుతున్నారు. మచిలీపట్నం నుంచి మోపిదేవి వరకు బైపాస్ రహదారి నిర్మాణానికి రూ.227.52 కోట్లతో చేపట్టిన నిర్మాణ పనులు నత్త నడకన సాగుతున్నాయని ఆరోపించారు. కూలిన వంతెనకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ కోరారు.
ఇదీ చదవండి:
రైతులకు మద్దతివ్వకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు: సీపీఐ రామకృష్ణ