విశాఖ ఫార్మా కంపెనీ సాయినార్ కెమికల్స్‌లో గ్యాస్ లీకేజ్ ఘటనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇద్దరు మృతి చెందడం పట్ల నారా లోకేశ్ సంతాపం వ్యక్తం చేశారు. ఎల్‌జీ పాలిమర్స్ దుర్ఘటన మరువకముందే మరో ఘటన జరగటం దురదృష్టకరమన్నారు.
మృతుల కుటుంబ సభ్యులకు లోకేశ్ సానుభూతి తెలిపారు. గ్యాస్ లీకేజీ ప్రమాద బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. గ్యాస్ లీకేజీ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: