జగన్ తన కేసుల మాఫీ కోసం పోలవరం ప్రాజెక్టును తాకట్టు పెట్టారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆరోపించారు. తెదేపా హయాంతో 70శాతం పనులు పూర్తైతే ఏడాదిన్నరలో కనీసం 2శాతం కూడా పనులు చేయలేదని విమర్శించారు. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం లోకేశ్ పర్యటించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వరదలతో నిండా మునిగిన రైతుల్ని ఆదుకోకపోగా అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. ఏడాదిన్నరలో 750 మందికి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులకు గాను రైతు భరోసాను 57వేల మందికే వర్తింపచేశారని దుయ్యబట్టారు.
పందిరిపల్లిగూడెం నుంచి లంక గ్రామాల వరద బాధితులను పడవలో వెళ్లి పరామర్శించారు. వడ్లకూటితిప్ప, పందిరిపల్లి గూడెం, గుమ్మాలపాడు, శృంగవరపాడు గ్రామాల్లో లోకేశ్ పర్యటన సాగింది. పెదపాలపర్రులో ఎన్టీఆర్ విగ్రహానికి, ముదినేపల్లిలో అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇదీ చదవండి:
పోలవరం 'డ్యామ్' నిర్మాణానికే నిధులు: కేంద్రం