కృష్ణా జిల్లాలో కరోనా నివారణకు మూడో దశ సర్వేను ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు.. ప్రజలు నిత్యావసర సరుకులు తీసుకునే సమయాన్ని తగ్గించి... 9 గంటల తర్వాత ఎవ్వరూ బయట తిరగకుండా చర్యలు చేపడుతున్నారు. రెడ్ జోన్లలో ఉండేవారు ఎవరూ ఇంటిని విడిచి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావొద్దని అధికారులు ఆదేశించారు. విజయవాడ నగరంలోని కరోనా పాజిటివ్ వచ్చిన ప్రాంతాలను ‘నో మూమెంట్ జోన్’లుగా ప్రకటించారు. విద్యాధరపురం, కుమ్మరిపాలెం, పాత రాజరాజేశ్వరిపేట, రాణిగారితోట, ఖుద్దూస్‌నగర్, పాయకాపురం, రామకృష్ణాపురం, బుడమేరు వంతెన, అజిత్‌సింగ్‌నగర్, రామవరప్పాడురింగ్, బెంజిసర్కిల్, ఎం.జి.రోడ్డు తదితర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.
ఎవరికి వారు స్వీయ నిర్బంధంలో ఉండడం ఒక్కటే కరోనా నియంత్రణకు మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రతి 50 ఇళ్లకు ఓ ఆశా వర్కర్‌ను కేటాయించి మూడో దశ సర్వే చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారి వివరాలను తెలుసుకుని యాప్‌లో నమోదు చేయటం... అనారోగ్యంతో ఉన్న వారి వివరాలను తెలుసుకుంటున్న వైద్యులు సూచనలు ఇస్తూ.. అవసరమైన వారిని క్వారంటైన్‌కు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
ఇదీ చూడండి: