కృష్ణా జిల్లా వీరులపాడు మండలం పెద్దాపురం వద్ద ఓ వాహనంలో నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్న 2840 తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. ఈ మేరకు నందిగామ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. పట్టుబడిన సరుకు విలువ సుమారు రూ. 3.20 లక్షలు ఉంటుందన్నారు. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మీరుపాడు మండలం రంగాపురానికి చెందిన రమావత్ ధర్మతేజ, రవీందర్గా గుర్తించారు.
ఉంగుటూరు మండలం పొట్టిపాడు టోల్ గేట్ వద్ద ఎస్ఈబీ పోలీసులు చేపట్టిన తనిఖీల్లో యాపిల్ లోడులో వస్తున్న ఓ లారీలో అక్రమంగా తరలిస్తున్న మద్యాన్ని గుర్తించారు. రూ. 7 లక్షల 50 వేలు విలువ చేసే 45 మద్యం కేసులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ ఎస్సై దుర్గాప్రసాద్ తెలిపారు. ముగ్గురుని అదుపులోకి తీసుకోని లారీని సీజ్ చేసి గన్నవరం ఎస్ఈబీ స్టేషన్కు తరలించారు. ఈ లారీలో ఢిల్లీ నుంచి గుడివాడకు మద్యం తరలిస్తున్నట్లు పోలీసుల విచారణలో తెలింది.
ఇదీ చూడండి: