కరోనా విపత్కర సమయంలో సాయం చేయడానికి అయినవాళ్లే ముందుకురాని పరిస్థితుల్లో.. కొన్ని స్వచ్ఛంద సంస్థలు సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయి. కృష్ణా జిల్లా లయన్స్ క్లబ్ గవర్నర్ పుట్టిగుంటు సతీష్.. లయన్స్‌క్లబ్ సభ్యులతోపాటు తనకున్న హెల్త్‌ఫౌండేషన్ ద్వారా సాయం చేస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. ఇప్పటి వరకు రూ.కోటి వరకు సాయం చేశారు. హోం ఐసోలేషన్‌లో ఉంటున్న వారి కోసం రెడ్‌క్రాస్ వైద్యులతో చర్చించి.. వారు నిర్దేశించిన ఔషదాలను కిట్‌ల రూపంలో తయారు చేయించి బాధితులకు పంపిణీ చేశారు.
జిల్లా యంత్రాంగం, పోలీసుశాఖ, ఇతర విభాగాల వారికి శానిటైజర్లు, మాస్కులు, ఫేస్‌షీల్డులు, పల్స్ ఆక్సిమీటర్లుతోపాటు విటమిన్-డి సొల్యూషన్ తదితరాలను ఫౌండేషన్ ద్వారా అందజేశారు.లయన్స్‌క్లబ్ ద్వారా 3,200 మందికి టీకా వేయించారు. 120 కుటుంబాలకు లయన్స్ క్లబ్ ద్వారా ఆరోగ్య బీమా చేయించారు.
ఇదీ చదవండి