లైసెన్స్డ్ సర్వేయర్లను గ్రామ సచివాలయల్లో సిబ్బందిగా నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర లైసెన్స్డ్ సర్వేయర్ల సంఘం చేపట్టిన నిరసనలు రెండో రోజుకు చేరాయి. విజయవాడ ధర్నాచౌక్లో లైసెన్స్డ్ సర్వేయర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని భిక్షాటన చేస్తూ వినూత్నంగా ఆందోళన చేశారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజా సంకల్ప యాత్రలో ''నేను ఉన్నా, విన్నా''నంటూ ఇచ్చిన హామీలకు అనుగుణంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2,500 కుటుంబాలు రోడ్డున పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్య పరిష్కరించకుంటే తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.
ఇదీ చూడండి: