విజయవాడలో ఎల్ఐసీ ఉద్యోగులు ధర్నా - LIC employees dharna in Vijayawada news
కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఎల్ఐసీ వాటాల అమ్మకం ప్రతిపాదనను నిరసిస్తూ విజయవాడలో ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. ఆర్థికమాంద్యంతో కష్టాలను ఎదుర్కొంటున్న ఉద్యోగులను మోసగించేలా.. కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ఉందని సీఐటీయు నాయకులు ఆరోపించారు. బడ్జెట్‌కి ముందు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన సూచనలను, డిమాండ్లను కేంద్రం పట్టించుకోలేదని చెప్పారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర నిర్వహిస్తున్న ఎల్ఐసీ వాటాల అమ్మకం ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.