కృష్ణా జిల్లా గుడివాడ రూరల్ మండలం మోటూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో కరోనా కలకలం రేపుతోంది. కరోనా కారణంగా విద్యార్థులను పాఠశాలకు పంపేందుకు తల్లిదండ్రులు జంకుతుండటం వల్ల స్కూల్ ప్రారంభించినప్పటికీ విద్యార్థుల హాజరు ఆశించిన మేర లేదు. మరోవైపు.. ఈ నెల 2న నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఓ టీచర్‌కు కరోనా సోకినట్టు నిర్ధరణ అయ్యింది.
15 మంది మాత్రమే హాజరు..
మొదటి రెండు రోజుల్లో 9, 10వ తరగతి విద్యార్థులు 15 మంది మాత్రమే హజరయ్యారు. మోటూరు జిల్లా పరిషత్ హై స్కూల్‌ను ఎండీఓ రమణ పరిశీలించి ప్రధానోపాధ్యాయడి నుంచి వివరాలు సేకరించారు.