విజయవాడ ప్రెస్ క్లబ్లో సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 'ఇసుక సమస్య పరిష్కారం' అంశంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, తెదేపా నేత వర్ల రామయ్య, కాంగ్రెస్ నేత తులసిరెడ్డి సహా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు హాజరయ్యారు. ఇసుక సమస్య పరిష్కారానికై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికులు పనులు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారని... లక్షలాది కార్మికులు రోడ్డున పడ్డారన్నారు. ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలకు పాల్పడిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని... తక్షణమే రాష్ట్రంలోని అన్ని ఇసుక రీచ్లు తెరవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రకటిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఇసుక కొరత సమస్యను పరిష్కరించాలనివర్ల రామయ్య, తులసి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి :