Left Parties Opposed Electricity Charges Hike: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా విద్యుత్ ఛార్జీల భారాలు వేస్తోందని వామపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విద్యుత్ ట్రూఆప్ ఛార్జీలు రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లను పెట్టొద్దని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. 10 వామపక్ష పార్టీలకు చెందిన నేతలు, ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
ఛార్జీల పెంపుపై పోరుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలను భాగస్వామ్యం చేసుకునేలా రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని సదస్సులో తీర్మానం చేశారు. ప్రభుత్వ వైఖరిని ప్రజలకు తెలియజేసేందుకు సంతకాల సేకరణ చేపట్టాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం మోపుతున్న విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిలుపునిచ్చారు. మిగులు విద్యుత్ ఉండాల్సిన రాష్ట్రంలో కరెంట్ కోతలు ఉన్నాయని విమర్శించారు.
Contract workers fire on CM ''మాట తప్పారు.. వెన్నుపోటు పొడిచారు.. " కాంట్రాక్టు ఉద్యోగుల ఆగ్రహం
విద్యుత్ ఛార్జీల భారాలు భరించలేక చిన్న పరిశ్రమలు, చేతివృత్తిదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని సీపీఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు ప్రసాద్ వివరించారు. వైసీపీ ప్రభుత్వం ప్రజల నుంచి మూడు రకాల ట్రూఅప్ ఛార్జీలను వసూలు చేస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగానికీ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయడం సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే సీఎం జగన్ ప్రజలపై విద్యుత్ భారాలు వేస్తున్నారని విమర్శించారు.
వైసీపీ ప్రభుత్వం వివిధ రూపాల్లో ప్రజలపై వేల కోట్ల రూపాయల భారం మోపుతోందని సీపీఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి మూర్తి, సీపీఐ ఎంఎల్ నాయకులు కిషోర్ బాబు మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల మోతతో.. సామాన్య ప్రజలు అవస్థలు పడుతున్నందునే.. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు పిలుపునిచ్చినట్లు.. వామపక్షాల నేతలు తెలిపారు.
Electricity Charges Hike: మరోసారి బాదుడే బాదుడు.. విద్యుత్ వినియోగదారులపై సర్దుబాటు పిడుగు
"ప్రజలపై భారం మోపను అని చెప్పి.. పదేపదే ఎందుకు భారం మోపుతున్నారు. దీనిపై నిలదీయాలి. ప్రభుత్వం రెండు అడుగులు అయినా వెనక్కి తగ్గాలి. తగ్గేటట్లు చేయాలి. కాబట్టి ఇది సాధించేవరకూ పోరాటం తీసుకురావాలి. అన్ని చోట్ల కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొనిపోవాలి. ఛార్జీలు తగ్గించేవరకూ పోరాటం చేయాలి". - రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి
"కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి వలన.. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపుతోంది. దీనిని వామపక్షాలు అన్నీ వ్యతిరేకిస్తున్నాయి. దీనికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాటం చేయాలని నిర్ణయించాం. ప్రజల నుంచి సంతకాలు సేకరిస్తాం". - శ్రీనివాసరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి
Troubles of new pensioners : పెన్షన్.. టెన్షన్..! పెన్షన్దారులకు షాకిస్తున్న విద్యుత్ సర్వీస్ నంబర్