కృష్ణా జిల్లా నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద సుబాబుల్ రైతులు సమస్యలు పరిష్కరించాలంటూ ధర్నాకు దిగారు. సుబాబుల్ టన్నుకు రూ. 5వేలు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. గిట్టుబాటు ధర కల్పిస్తామని ఎన్నికల సమయంలో సీఎం హామీ ఇచ్చారని.. రెండేళ్లైనా ఆ హామీని నెరవేర్చలేదని వారు మండిపడ్డారు. ప్రస్తుతం టన్నుకు రూ. 1300లు మాత్రమే వస్తుందని.. ధర గిట్టుబాటు కావడం లేదని వాపోయారు.
కర్మాగారాలు, పేపర్ కంపెనీలు దళారులను ఏర్పాటు చేసుకొని రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. సమస్యలను పరిష్కరించి..ధరలను పెంచాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఐక్య కార్యాచరణ సమితి నాయకులు సైదులు, చుండూరు సుబ్బారావు, కాశీం, గోపాల్, తుమ్మల నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి. ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ విద్యార్థిసంఘాల ధర్నా.. మంత్రుల నివాసాలు ముట్టడికి యత్నం