Kuwait Passengers Serious on Air India organization: కృష్ణా ఎయిర్ఇండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్ధ పని తీరుపై ప్రయాణికులు మండిపడ్డారు. సమాచార లోపం వల్ల విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానయాన ప్రయాణికులు నిలిచిపోయారు. దీంతో కువైట్ వెళ్లాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. బాధితులు తీసుకున్న టిక్కెట్టుపై విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు ఉందని వారు తెలిపారు. అయితే తమను ఉదయం 11 గంటలకు సంస్థ ప్రతినిధులు రమ్మన్నారని వారు తెలిపారు. దీంతో ఎందుకైనా మంచిదని వారు ఉదయం 10 గంటలకు బాధితులు అక్కడికి చేరుకున్నామని అన్నారు. అయితే అప్పటికే విమానం అక్కడి నుంచి ప్రత్యేక విదేశీ సర్వీసు కువైట్కు బయలుదేరి వెళ్లిపోయిందని బాధితులు వాపోయారు.
కాగా.. ఉదయం 10 గంటల సమయంలో ప్రత్యేక విదేశీ సర్వీసు కువైట్కు బయలుదేరి వెళ్లినట్లు విమానయాన సంస్థ సమాచారం అందించింది. విమానం ఎప్పుడు బయల్దేరుతుంది అనే విషయంపై ప్రయాణికులకు పూర్తి సమాచారం ఇచ్చామని సంస్థ తెలిపింది. అయితే దీనిపై సమాచారం ఇచ్చామన్న సంస్థ ప్రతినిధులు గమనించని కారణంగానే.. ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారుని వెల్లడించారు. అయితే సుమారు 11 మంది ప్రయాణికులు విమానాశ్రయంలోనే నిలిచిపోయారు. ప్రయాణికులకు నచ్చజెప్పే ప్రయత్నంలో ప్రతినిధులు విమానయాన సంస్థను నిలదీశారు. అయితే ఎయిర్ఇండియా సంస్థ ఇలా చేయటం సరికాదని బాధితులు మండిపడ్డారు. దీనివల్ల వారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"మా టికెట్లో విమానం మధ్యాహ్నం 1.30 గంటలకు అని ఉంది. అయితే మమ్మల్ని ఉదయం 11 గంటలకు రమ్మన్నారు. ఎందుకైనా మంచిదని మేము ఉదయం 10 గంటలకే ఇక్కడికి వచ్చాము. అయితే అప్పటికే విమానం వెళ్లిపోయింది. సంస్థ ప్రతినిధులను ఈ విషయంపై అడిగితే.. వెబ్సైట్ వాళ్లకు ఇంటిమేషన్ ఇచ్చామనే సమాధానాన్ని చెప్తున్నారు తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ఫ్లైట్ వెళ్లిపోవటం వల్ల నాతో పాటు 11 మంది ప్రయాణికులు నిలిచిపోయారు. ఎయిర్ఇండియా విమానయాన సంస్థ ఇలా నడుచుకోవటం కరెక్ట్ కాదు. దీనివల్ల మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము."
- పాల్, బాధితుడు
ఇదిలా ఉండగా ఎయిర్ఇండియాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనల కారణంగా ఒక వారంలోనే రెండు సార్లు జరిమానాల పాలైంది. దీంతో ఆ సంస్థ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. అదేంటో తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.