కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎస్పీ రవీంద్రనాథ్ పర్యటించారు. కరోనా పాజిటివ్ గా నమోదైన ఇరువురి కుటుంబ సభ్యులు 15 మందిని బలుసుపాడు రోడ్డు క్వారంటైన్ సెంటర్కి తరలించామన్నారు. రెడ్ ఎలర్ట్ ప్రకటించిన మూడు రోజులు ఎవ్వరు బయటకు రావద్దని సూచించారు. వాహనాలు రోడ్డు పైకి వస్తే సీజ్ చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఐపీసీ సెక్షన్ 188 కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నిత్యావసరమైన పాలు, మెడిసిన్, కిరాణా సరుకులు డోర్ డెలివరీ చేస్తామన్నారు.
ఇదీ చూడండి: